YSR Bharosa Scheme Details 2022, Eligibility, Status, List

0
59
views

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ కులాలకు, మైనారిటీ వర్గాలకు భూమి లేని కౌలు రైతు కుటుంబాలకు మొదలైన రైతు కుటుంబాలకు ఆర్థిక సహయాం అందించడం కోసం మన జగనన్న ప్రభుత్వం వైయస్ఆర్ రైతు భరోసా అనే పథకాని ప్రారంభించింది. అయితే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వైయస్. ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ఏటా మొత్తరం రూ.13,500/- అక్షరాల పదమూడు వేల ఐదు వందల రుపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించింది. అయితే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం వైయస్.ఆర్ రైతు భరోసా పథకాన్ని 2019లో అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించింది. మరి వైయస్ ఆర్ రైతు భరోసా పథకం కింద వివిధ రకాల వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే మిత్రులారా నేను ఈ పోస్ట్ లో మీకు వైయస్ ఆర్ రైతు భరోసా పథకానికి సంభందించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలియజేస్తాను. ఈ పోస్ట్ లో నేను వైయస్ ఆర్ రైతు భరోసా పథకానికి సంభందించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మీరు ఈ పోస్ట్ ద్వార ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఎక్కడ దరఖాస్తు చేసుకొవాలొ మొత్తం సమాచారం తెలియజేస్తాను. ఈ పోస్ట్ ను మీరు చివరి వరకు పూర్తిగా చదవండి.

YSR RYTHU BHAROSA SCHEME 2022

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు వైయస్ ఆర్ రైతు భరోసా పథకం యొక్క 8వ విడత డబ్బులను 2022, జనవరి 8వ తేదీన అర్హులైన ప్రతి రైతుల ఖాతాల్లో డబ్బును జమా చేయడం జరిగింది. అయితే రైతులందరికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తమ క్యాంపు కార్యలయంలో నుండి నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమా చేయడం జరిగింది. వైయస్ ఆర్ రైతు భరోసా మూడో విడత కింద ముఖ్యమంత్రి తమ క్యాంపు కార్యలయంనుండి బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా అర్హుల జాబితాలో ఉన్న మొత్తం 50.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,086 కోట్లు జమా చేయడం జరిగింది.

వైయస్ ఆర్ రైతు భరోసా పథకం అనేది ముందుగా అక్టోబర్ 15, 2019 లో ప్రారంభించారు. రైతు భరోసా మొదటి సంవత్సరం లో మొత్తం 45 లక్షల రైతులకు 6162.45 కోట్లు రూపాయలు వేయడం జరిగింది. ఈ మొత్తంకు గాను 2525 కోట్లు పిఎం. కిసాన్ పథకం కింద కేంద్ర సర్కార్ విడుదల చేస్తే మిగితా రూ.3637.45 కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మరి రైతు భరోసా రెండో సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 49.40 లక్షల రైతు కుటుంబాలకు గాను వారి ఖాతాల్లో రూ.6750.67 కోట్లు రూపాయలు జమా చేసింది. మరి రూ.6750.67 కోట్లు రూపాయలకు గాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రూ.3784.67 కోట్లు రూపాయలు కేటాయించింది మరి మిగితా రూ.2966 కోట్లు రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది

YSR RYTHU BHAROSA 3RD INSTALLMENT

వైయస్ ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత ను 2022, జనవరి 3వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే వైయస్ ఆర్ రైతు భరోసా పథకం మూడో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5058486 మంది లబ్ధిదారులుకు రైతు భరోసా పథకం కింద ప్రయోజనం కలిగింది. అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5058486 మంది లబ్ధిదారుల కోసం మొత్తం రూ.1086 కోట్లు రూపాయలు ఖర్చు చేసింది. మరి రైతు భరోసా పథకం మూడో విడత ను ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు తమ క్యాంపు కార్యలయంలో నుండి ఒక్క బటన్ ను నొక్కి అర్హులైన ప్రతి రైతుల ఖాతాల్లో డబ్బును జమా చేసారు. అయితే మరి 2021-2022 సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం రూ.6899.67 కోట్లు రూపాయలు డిపాజిట్ చేయబడ్డాయి. మరి గత మూడు సంవత్సరాల్లో ఈ పథకం రూ.19812.79 కోట్లు పెట్టుబడి సాయన్ని అందించింది.

YSR RYTHU BHAROSA OVERVIEW

Name Of The Scheme YSR Rythu Bharosa
Launched By Andhra Pradesh Govt (CM Jagan)
Benificiary SC/ST/Minority/BC
Benifits Per Year Rs.13,500/-
Official Website ysrrythubharosa.ap.gov.in

AP RYTHU BHAROSA FINAL LIST

వైయస్ ఆర్ రైతు భరోసా పథకం అనేది పేద రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు పుట్టించిన ఒక సంక్షేమ పథకం. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాల హామిల లో ఈ పథకం కూడా ఒకటి. మరి వైయస్ ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతు కు సంవత్సరాని రూ.12,500/- అక్షరాల పండ్రెండు వేల ఐదు వందల రూపాయలు లబ్ధి అందుతుంది. అలానే దీనితో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డి గారు దీనికి అదనంగా సున్నా వడ్డితో పాటు వడ్డీ రుణాలు, ఉచిత బోర్‌వెల్స్, కోల్డ్ స్టోరేజి మరికు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందిస్తుంది.

AP RYTHU BHAROSA BENIFITS

వైయస్ ఆర్ రైతు భరోసా నుండి ఆంధ్రప్రదేశ్ రైతులందరికి భారిగా ఉపయోగాలు ఉన్నాయి వాటన్నింటిని మనం చూద్దాం. 1. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు సున్నా శాతం వడికే రుణాలు అందుతాయి. 2. ప్రతి సంవత్సరానికి చొప్పున ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500/- అందుతాయి మరి దీనికి గాను మొత్తం 5 సంవత్సరాలకు రూ.67,500/- రూపాయలు అందుతాయి. 8. ప్రతి సంవత్సరాని కౌలు రైతులకు రూ.2,500/- చొప్పున ఇవ్వడం జరుగుతుంది. 4. ప్రతి రోజు 9 గంటల వరకు ఉచిత విద్యూత్ ఇవ్వడం జరుగుతుంది. 5. ఉచిత బోర్‌వెల్ సౌకార్యం కూడా కలుగుతుంది. 6. రైతుల వారి ట్రాక్టర్ల రోడ్డు పన్ను (ROAD TAX) కట్టవలసిన అవసరం లేదు. 7. ప్రతి రైతు కుటుంబానికి రూ.5,00,000/- లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ కలుగుతుంది. 8. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తామన్నారైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఇన్ని ప్రయోజనాలు కలుగుతున్నాయి.

వైయస్ ఆర్ రైతు భరోసా లక్షణాలు:

వైయస్ ఆర్ రైతు భరోసా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మీదుగా ప్రారంభించిన పథకం. 2. వైయస్ ఆర్ రైతు భరోసా పథకం 2019, అక్టోబర్ 19వ తేదీన ప్రారంభించడం జరిగింది. 8. 2019 నుండి 2024 వరకు మొత్తం 5 సంవత్సరాలుగా ప్రతి రైతు కుటుంబం వైయస్ ఆర్ రైతు భరోసా కింద లబ్ధి పొందుతారు. 4. అర్హులైన రైతులకు ప్రతి ఏటా రూ.13,500/- చొప్పున లబ్ధి పొందుతారు 5. ఈ పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం 1766 కోట్లు విడుదల చేసింది.

వైయస్ ఆర్ రైతు భరోసా అర్హత :
  • దరఖాస్తు దారుడు ఆంద్రప్రదేశ్ వాసి కలిగి ఉండాలి, కేవలం ఆంద్రప్రదేశ్ రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
  • దరఖాస్తు దారుడు కచ్చితంగా వ్యవసాయ రంగానికి అనబంధంగా ఉండాలి.
  • వైయస్ ఆర్ రైతు భరోసా పథకం కు చిన్న ఉపాంత లేదా వ్యవసాయ కౌలుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  •  వైయస్ ఆర్ రైతు భరోసా పథకానికి దకఖాస్తు చేసుకొనే అభ్యర్తికు
  • ఎకరాల సాగు భూమి కలిగి ఉండాలి.

అయితే ఇప్పుడు వైయస్ ఆర్ రైతు భరోసా పథకం కు సంభందించిన పూర్తి వివరాలు ఇందులో తెలపడం జరిగింది. మీకు ఈ పథకం కు సంభందించి ఇంకా ఏదైన డౌట్ కనుక ఉంటే కింద కమెంట్స్ | తెలపండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here