Top 3 Motivational Stories In Telugu

0
51
views

Hello friends, In today’s world many people are facing problems in their life, many of them are facing failure in their life, this all happening without motivation in their daily life. If you want to become a successful person in life you need to hardwork, to work hard in daily you need a motivation. Without motivation you cannot achieve anything in life. So in this post i have posted a powerful motivational posts. Read it and get motivated. Thank you.

3 Powerful Motivation Articles –

#1. Don’t Trust Anyone

నువ్వు గాలి నుండి ఆరిపోకుడదని ఏ దీపాన్నైతే నీ చేతులు అడ్డపెట్టి కాపాడుతావో, ఆ దీపమే నీ చెతుల్ని కాల్చుతుంది, అందుకే కొన్ని సమయాల్లో నిర్లక్ష్యంగా ఉండటమే మంచిది, ఎవరినైతె నువ్వు ఎక్కువ పట్టించుకుంటే అతనే నీకు దుఖఃనికి గురిచేస్తుంది, ఇప్పుడు నీ చుట్టు ప్రక్కన ఉన్నారే జనాలు, నీ మిత్రులు నీ బంధువులు నీ నుండి వారికి ఏదొ అవసరం ఉంది, ఏరోజైతే నీ నుండి వారికి అవసరం తీరిపోతె ఆ రోజు నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోతావు గుర్తించుకో, నిజానికి ఇక్కడ ఒకరు ఒకరికి సహయం చేయ్యరు, ఈలోకంలో ప్రజలకు ADVANTAGE తీసుకొనే రోగం ఉంది, ఈ లోకం స్వార్థంతో నడుస్తా ఉంది, అన్ని బంధాలు కేవలం అవసరం ఉన్నవరుకే, ఈలోకంలో నువ్వు ఒక్కడివే జాగ్రత్తపడాలి, ఒక్కడే పోరాడాలి, నీకు సహయం చేయడానికి ఎవరు ముందుకు రారు, నీ నుండి ఎవరికైతే ఎక్కువ ఆశ ఉంటుందో వారు నీపై ఎక్కువ ప్రేమను చూపిస్తారు, వాడి పని ఉన్నంత వరకే వాడు నీవాడు ఒక్కసారి పని అయిపోయిందా ఇక అంతే వాడేవడో నువ్వెడో. మిత్రమా ఈరోజుల్లో ప్రేమికులు ఎలా ఉన్నారంటే అవతల వాడు ఎంత అబద్ధాలు చెప్తాడో వాడిపైనే ఫిదా అయిపోతారు, మంచోళ్ళ స్థానాన్ని తొక్కెస్తున్నారు, జీవితంలో ఏదైన సాధించాలంటే 2 రకాలైన మనుషులు ఉండటం చాల అవసరం, ఒకడు నీకు కిందకు లాగడానికి ప్రయత్నిస్తాడు, మరి రెండోవాడు నువ్వు ఎదగాలని నీకు ముందుకు తోస్తాడు, స్నేహంలో ద్రోహికి చోటు లేదు, మరి ద్రోహితో స్నేహం అస్సలు లేదు, ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో పరాయి వాళ్ళ కన్న నీ వాళ్ళే నిన్ను చూసి మండుతారు, మిత్రమా నీ ఫీలింగ్స్ కన్న నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం అప్పుడే నీకు సమాజంలో గౌరవం ఉంటుంది, మిత్రమా ముందు నువ్వు నీ గురించి ఆలోచించు తరువాత వేరే వాళ్ళకు సలహా ఇస్తువుగాని, నేను చెప్పిన మాటలు నీలోపల మంటలు పుట్టిచ్చింటే ఈ పోస్టును లైక్ చేసి ఇతరులతో షేర్ చేసుకో.

#2. No One Helps

ఒక మనిషి ఎక్కువగా నవ్వుతున్నాడంటే అతను సంతోషంగా ఉన్నట్టు, ఆదే మనిషి ఎక్కువ సార్లు నవ్వుతున్నాడంటే అతను సమస్యల్లో ఉన్నట్టు అని అర్థం, మిత్రమా ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో ఈ ప్రపంచం నీ ముందు ఉన్నట్టు నీ వెనుక ఉండదు, మనం ఎలాంటి లోకంలో బ్రతుకుతున్నామంటే, ఇక్కడ కాలం కన్న మనుషులు వేగంగా మారుతారు, కాబట్టి మిత్రమా తొందరపడి ఎవరిని గుడ్డిగా నమ్మరాదు, ఈ ప్రపంచంలో నీకు అంటూ ఎవరు సహయం చేయ్యాలని అనుకోరు, ఈ ప్రపంచంలో చాల మంది నీకు మొసం చేసెవారే, నువ్వు పైకి ఎదగాలి, ఏదైన సాధించాలి అని అనుకుంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకొవడం మొదలు పెట్టాలి నువ్వు ఇతరుల మీద ఆధారపడి ఉంటే మాత్రం దిక్కులేని వాడిగా మిగిలిపోతావు. మిత్రమా ఏవిధంగా అయితే అందమైన కమలాన్ని పొందాలంటే నువ్వు బురదలో కాళ్ళు వేయ్యడం తప్పదో ఆ విధంగానే గొప్ప విజయాన్ని సాధించడానికి కొన్ని సార్లు ఎదురు దెబ్బలు తినడం కూడా తప్పదు. మనిషి యొక్క జీవితంలో ఓటమి, గెలుపు సహజం, కుటుంబంలో గొడవలు, ప్రేమలు సహజం. అలాగే లోకంలో కష్టాలు సుఖాలు రావటం సహజం, వీటన్నింటి ఆనందంగా ఎదుర్కొవటమే మన మనిషి యొక్క ముందస్తు పని. జీవితంలో నీకు కావల్సింది చాల తేలికగ రాదు, మిత్రమా ఓడిపోతే మరల ఎలా గెలవాలో నేర్చుకోవాలి, నువ్వు ఒకరితో మొసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. మనిషి ఒక ఆలోచనతో మరి ఒక నిర్ణయంతో అన్నింటిని తలకిందులు చేసే శక్తి ఉంటుంది కాని ఆ ఆలోచన వచ్చేంత ప్రశాంతత, నిర్ణయం తీసుకొనెంత ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండదు. నీ జీవితం నీది నీ వెనుక ఒకడు వచ్చిన రాకపోయిన నువ్వు మాత్రం ఎక్కడ ప్రయాణం ఆపకు, నీకు నువ్వే తోడు ఎవరు కూడా నీ బుజం మీద చెయ్యి వేసి నీ వెనుక నేను ఉన్నాలేరా నీకు నేను తోడు ఉంటా అని అనే వాడు ఎవరు లేరు, ఈ జీవితానికి నువ్వె అంత నీ జీవితాన్ని నువ్వె చూసుకోవాలి, ఒకరి మీద మాత్రం ఎప్పటికి ఎన్నింటికి ఆధారపడి మాత్రం ఉండకు. ఏదైన చెయ్యి స్వంతంగా చెయ్యి. ఎవరిని నమ్మకు ఎరికి నీ స్థానాన్ని ఇవ్వకు. అర్థమైందా, ఇక్కడితో SIGNING OFF.

#3.Life Is Full Of Haters

ఈ నేటి సమాజం యొక్క కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా నువ్వు కనుక ఏదైన సాధిస్తే అందరికి నువ్వు మనోడు, ఏమి సాధించకపోతె నువ్వు దేనికి పనికిరానివాడు, మిత్రమా ఈలోకంలో నీకు చాల మంది శత్రువులు ఉన్నారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఓడిపోయి గెలిస్తే, ఆ గెలుపు గట్టిగా ఉంటుంది, గెలుపు యొక్క పగ్గాలను అందుకోవడమే ముఖ్యం కాని ముందు అందుకున్నామా, తరువాత అందుకున్నామా అనేది ముఖ్యమేమి కాదు. మిత్రమా నువ్వు జీవితమే అనే యుద్ధంలో గెలవాలంటే నీకు కత్తులు కటారాలు ఏమి అవసరం లేదు, నీకు కావల్సింది. మంచి ఆలోచనలు, అనుభవాలు. ఈలోకంలో అనుకున్నది సాధించటం కష్టమేమి కాదు నువ్వు అనుకుంటే మాత్రం కచ్చితంగా చెయ్యగలవు, మిత్రమా నీకు సాధ్యము కాదు అనే భావనను నీ మనసులోనుంచి నువ్వు తోలగించుకుంటే విజయం వైపు నువ్వు వేసే తొలి అడుగు ఎందుకంటే మిత్రమా జీవన పోరాటంలో ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం మరోకటి లేదు. నువ్వు ఒక్కసారి ఓడిపోయినంత మాత్రమా నువ్వు ఎప్పుడు గెలవలేవు అని అర్థం కాదు, నువు ఎన్ని సార్లు ఓడిపోయిన కూడా ఆ భగవంతుడు నీకు ఎన్నో అవకాశాల్ని కల్పిస్తునే ఉంటాడు. నువ్వు గొప్పగా ఏదైన సాధించాలంటే ముందు నీకు ఎమొషన్స్ ఉండకూడదు, ఎక్కువగా ఎవరిని నమ్మటం గాని ఎక్కువగా ఎవరిని ప్రేమించటం గాని ఉండకూడదు, నీకు ఎమోషన్స్ మరి అందరిని ఎక్కువగా నమ్మటం వంటి అలవాట్లు ఉంటే నువ్వు అనుకున్నది సాధించలేవు మిత్రమా, వీటిలో నీకేదైన అలవాటు ఉంటే నువ్వు ఇప్పుడే మానేసుకో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here